: అమరావతి కలకాలం విరాజిల్లుతుంది: వెంకయ్య
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి అందరి ఆశీస్సులు ఉన్నాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి ఇంత మంది తరలిరావడం శుభసూచకమని అన్నారు. చిరస్థాయిగా అమరావతి విరాజిల్లుతుందని తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన అయినా వెలువడుతుందా? అన్న ప్రశ్నకు ఆయన బదులివ్వలేదు. మరోవైపు, అమరావతి ప్రాంగణానికి ప్రముఖులు, సామాన్యులు భారీగా తరలి వస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.