: అమరావతికి అంకురార్పణ నేడే... మరికాసేపట్లో వేడుక ప్రారంభం


తెలుగు జాతి మాత్రమే కాక యావత్తు ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన శుభ ఘడియలు రానే వచ్చాయి. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలోని ఉద్ధండరాయునిపాలెంలో శంకుస్థాపన కోసం ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. ఏపీ ప్రభుత్వ పెద్దలంతా అతిథుల కోసం ఎదురుచూస్తున్నారు. కనివీనీ ఎరుగని విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఏర్పాట్లలో ఏమాత్రం రాజీ పడని విధంగా వ్యవహరించారు. వీలయినంత ఎక్కువ మందిని కార్యక్రమానికి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన స్వహస్తాలతో అమరావతికి శంకుస్థాపన చేయనున్నారు. విజయదశమి పర్వదినాన వేడుకలా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని కనులారా వీక్షించేందుకు ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు అమరావతి పరిసరాలకు చేరుకున్నారు. మరికాసేపట్లో అతిథుల రాక కూడా ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News