: ఆహ్వానం లేటుగా అందింది...పనులున్నాయి: సీతారాం ఏచూరి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం అందిందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఆహ్వాన పత్రం ఆలస్యంగా అందడంతో ఇతర పనులు ముందుగానే కుదుర్చుకున్నానని, దీంతో శంకుస్థాపనకు రావాలని ఉన్నా హాజరుకాలేకపోతున్నానని అన్నారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం విజయవంతంగా పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలతో పాటు అతిరథమహారధులు శంకుస్థాపన కార్యక్రమంలో పాలుపంచుకునే విధంగా దీనిని డిజైన్ చేయడం అందర్నీ ఆకట్టుకుందని ఆయన చెప్పారు. శంకుస్థాపనకు సందర్భంగా ఆర్థికలోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ప్రధాని మోదీ ఆదుకుంటారని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు.