: శంకుస్థాపన ప్రాంతానికి చేరుకున్న బాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజారాజధాని అమరావతి శంకుస్థాపన ప్రాంతానికి చేరుకున్నారు. అమరావతిలోని ఉద్దండరాయుని పాలెంలో శంకుస్థాపన ఏర్పాట్లను ఆయన పరిశీలిస్తున్నారు. అమరావతి శంకుస్థాపన వేదిక, వీవీఐపీలు, వీఐపీలు ఆసీనులు కానున్న వేదిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్న వేదిక, గ్యాలరీ, వంటకాలు, భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలిస్తున్నారు. ఇతర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. వాహనాలకు రోడ్ల కేటాయింపులు, వీఐపీలను వేదిక వద్దకు తీసుకురావడం వంటి ఏర్పాట్లపై ఆయన మరోసారి అధికారులకు సూచనలు ఇస్తున్నారు. శంకుస్థాపనకు ఎలాంటి అవాంతరం కలుగకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. ఏర్పాట్లను పరిశీలించే క్రమంలో ఆయన ఆ ప్రాంతంలో కలియతిరుగుతున్నారు.

  • Loading...

More Telugu News