: సంక్రాంతిని గుర్తుకు తెస్తున్న ఏపీకి వెళ్లే రైళ్లు


సంక్రాంతి పండుగను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటారు. ఆ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు దారితీసే రైళ్లన్నీ రద్దీ నెలకొంటాయి. ఏపీలో దసరాను మరీ అంత ఘనంగా జరుపుకోరు. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ కు దారితీసే రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా హైదరాబాదు నుంచి బయల్దేరిన రైళ్లలో నిల్చునేందుకు కూడా చోటు లేదంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతి శంకుస్థాపనలో పాలుపంచుకునేందుకు అంతా తరలివెళ్తున్నారు. భారీ ఎత్తున నిర్వహిస్తున్న చారిత్రాత్మక కార్యక్రమంలో భాగమయ్యేందుకు ఆంధ్రులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బస్సులు, ట్రైన్లు, వాహనాలతో అమరావతి చేరుకుంటున్నారు. దీంతో తీవ్రమైన రద్దీ నెలకొంది.

  • Loading...

More Telugu News