: అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టిన కారు... ముగ్గురు విద్యార్థుల దుర్మరణం


దసరా పండుగకని బెంగళూరు యూనివర్శిటీలో లా చదువుతున్న ముగ్గురు విద్యార్థులు హైదరాబాద్ వస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. కర్నూల్ జిల్లాలోని డోన్ వద్ద ఏడో నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడమే కాకుండా అటుగా వస్తున్న ఇన్నోవా వాహనాన్ని కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిత్విక్ (19), హశ్రిత (19), శశిధర్ (19) అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, మరో విద్యార్థి సమ్మెద్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ విద్యార్థిని సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News