: కేసీఆర్ రేపటి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఆయన రేపటి షెడ్యూల్ ఈ విధంగా ఉంది. * ఉదయం 10.15 గంటలకు సూర్యాపేట నుంచి హెలికాప్టర్ లో బయల్దేరుతారు. * 10.45కి అమరావతి చేరుకుంటారు. * మధ్యాహ్నం 2 గంటల వరకు అమరావతిలో ఉంటారు. * 2.30కి సూర్యాపేట చేరుకుంటారు. స్థానిక గొల్లబజార్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేస్తారు. * సాయంత్రం 4.30 గంటలకు దత్తత గ్రామం ఎర్రవెల్లికి వెళతారు. * 6 గంటలకు నర్సన్న పేట గ్రామంలో పర్యటిస్తారు.