: చంద్రబాబు, కేసీఆర్ లు చిరకాల మిత్రులు: డీఎస్
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ చిరకాల మిత్రులని చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులు సఖ్యతతో ముందుకు సాగడానికి అమరావతి కార్యక్రమం నాంది పలుకుతుందని తెలిపారు. ఇరు రాష్ట్రాలు కలసికట్టుగా అభివృద్ధి చెందాలని ఆయన అభిలషించారు. డీఎస్ ను తెలుగుదేశం నేతలు కలసి, అమరావతి శంకుస్థాపనకు హాజరుకావాలంటూ ఆహ్వానపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ, పైవిధంగా స్పందించారు.