: నాన్నిచ్చిన నా గొంతుకు అసలైన గౌరవం నేడు దక్కింది: సాయికుమార్
అమరావతి శంకుస్థాపనకు యాంకరింగ్ చేసే అవకాశం లభించడం, తన జీవితంలో లభించిన అతిపెద్ద వరమని డైలాగ్ కింగ్ సాయికుమార్ అభివర్ణించాడు. తన గొంతును తండ్రి అందిస్తే, అందుకు అసలైన గౌరవం ఇప్పుడు లభించిందని అన్నాడు. తనకన్నా ముందు హీరో అయిపోయిన తన స్వరంతో రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపాడు. 40 ఏళ్ల తన ప్రస్థానంలో ఇప్పటి వరకూ చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తయితే, మాతృభూమి రుణం తీర్చుకునేలా దక్కిన ఈ అవకాశం ఒక్కటీ ఒక ఎత్తని అన్నాడు. ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇది తనకో పరీక్ష వంటిదని అన్నాడు. ప్రజల అభిమానం, పెద్దల ఆశీర్వాదం, కనకదుర్గమ్మ కటాక్షంతో, చరిత్రలో ఈ కార్యక్రమం నిలిచి పోవాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.