: అమరావతిపై 'అమ్మ' స్పందనిది!
సరికొత్త రాజధానిని అద్భుతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న చంద్రబాబునాయుడి ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అభిలషించారు. ఈ మేరకు ఆమె చంద్రబాబుకు లేఖ రాశారు. శంకుస్థాపన ఏ ఆటంకాలూ లేకుండా పూర్తి కావాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేంతటి ప్రాధాన్యతను సంతరించుకుందని అభిప్రాయపడ్డ ఆమె, కొత్త రాజధానికి బాబు చేస్తున్న కృషి ఫలితాలను అందించాలని ఆశిస్తున్నట్టు ఆ లేఖలో వెల్లడించారు. అనివార్య కారణాల వల్ల తాను ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నట్టు జయలలిత పేర్కొన్నారు.