: ఇవి మంచి రోజులు కాదు... పాత రోజులే!: మోదీపై నితీష్ నిప్పులు
బీహార్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న వేళ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రధాని మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మంచి రోజులు (అచ్ఛే దిన్) పోయాయని, పాత రోజులు వచ్చేశాయని ఆయన విమర్శించారు. ముస్లింలను కొట్టి చంపుతున్న ఘటనలపై ఆయన డైరెక్టుగా మాట్లాడలేకపోతున్నారని నిప్పులు చెరిగారు. ఈ తరహా ఘటనలను నివారించేలా కఠిన నిర్ణయాలు సైతం ఆయన తీసుకోలేకున్నారని అన్నారు. "మోదీ ఓ పరదా వెనకుండి మాట్లాడుతున్నారు. చేతలు లేని మాటలు ఎందుకు? ఆయన వచ్చిన తరువాత ప్రపంచ చిత్రపటంలో భారత ఇమేజ్ ఎంతో దెబ్బతింది. మోదీ ఇప్పటికే నవ్వుల పాలయ్యారు" అని విమర్శించారు.