: నవ్యాంధ్రకు వస్తున్న వీవీఐపీలు వీరే!


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి వస్తున్నట్టు ఆహ్వానాలు అందుకున్న 121 మంది నుంచి ఏపీ అధికారులకు సమాచారం అందింది. వీరిలో పలువురు గవర్నర్ లు, విదేశీ అంబాసిడర్లు, సుప్రీంకోర్టు జడ్జీలు, పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు, ప్రముఖులు ఉన్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి, చంద్రబాబు మిత్రుడు ప్రకాష్ సింగ్ బాదల్, అస్సాం, నాగాలాండ్‌ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ పీబీ ఆచార్య, వెనిజులా అంబాసిడర్‌ ఆగస్టో మాంటియిల్‌ దంపతులు, సుప్రీంకోర్టు జడ్జి నూతలపాటి వెంకటరమణ, బెల్జియం, బల్గేరియా అంబాసిడర్ లు అమరావతికి వస్తున్నట్టు వెల్లడించారు. వీరితో పాటు బంగ్లాదేశ్‌, బ్రిటన్, రువాండా హైకమిషనర్లు, కెనడా ట్రేడ్ కమిషనర్, జపాన్ ప్రతినిధిగా చీఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎక్స్‌టర్నల్‌ ఆర్గనైజేషన్‌ హాజరు కానున్నారు. కోనేరు హంపి, వీవీఎస్ లక్ష్మణ్, తోషిబా ఇండియా ఎండీ కెంజీ యురేయ్‌, వీ2 ఎక్స్‌ పో సింగపూర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ రాజా గంజుపల్లి, దాల్మియా సిమెంట్స్‌ మేనేజింగ్ డైరెక్టర్ గోనె పునీత్‌ దాల్మియా, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ ప్రతినిధి మసాయు కికుబో, వాల్‌ మార్ట్‌ ఇండియా ఉపాధ్యక్షుడు రజనీష్‌ కుమార్‌, జీఎంఆర్‌ గ్రూప్‌ చైౖర్మన్‌ జీఎం రావులు తమ రాకను ఖరారు చేశారు. ఇంకా, లాస్‌ ఏంజెల్స్‌ తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షుడు విజయభాస్కర్‌, సుమాటో కార్పొరేషన్‌ ప్రతినిధి హిరోయో తదితరులతో పాటు వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు వస్తున్నారు. వీరందరికీ మరువలేని ఆతిథ్యం ఇవ్వాలని, ఏ లోటూ రాకుండా చూసుకోవాలని ఇప్పటికే చంద్రబాబు అధికారులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News