: మోహినీ రూపంలో చంద్రప్రభ వాహనంపై శ్రీవారు
సూర్యప్రభ వాహనంపై ఈరోజు ఉదయం విహరించిన శ్రీనివాసుడు, రాత్రి చంద్రప్రభ వాహనంపై ఊరేగాడు. తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడోరోజు రాత్రి మలయప్పస్వామి మోహిని రూపంలో చంద్రప్రభ వాహనంపై విహరించారు. చంద్రుడిని వాహనంగా చేసుకున్న స్వామిని వీక్షిస్తే ఆరోగ్యం లభిస్తుందన్నది భక్తుల నమ్మకం. మోహినీ రూపంలో స్వామి వారిని దర్శించుకున్న భక్తులు భక్తి భావంతో గోవింద నామస్మరణ చేశారు. చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.