: థాయ్ లాండ్ లో ప్రవాసభారతీయుడి ఆత్మహత్య
థాయ్ లాండ్ లోని పాటుమ్ థానీ రాష్ట్రంలో ప్రవాసభారతీయుడు రాజేశ్ సింగ్ (37) ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ ఒంటరిగా నివసిస్తున్న రాజేశ్ సింగ్, అదే భవనంలో ఒక అంతస్తులో తన మిత్రులతో కలిసి పాఠశాల కూడా నిర్వహిస్తున్నాడు. రాజేశ్ ఉరి వేసుకుని ఉండడాన్ని అతని ఇంటి పనిమనిషి ఈరోజు ఉదయం గమనించాడు. ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించారు. అక్కడ లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై రాజేశ్ మిత్రులు మాట్లాడుతూ, తన ఆర్థిక ఇబ్బందుల గురించి రాజేశ్ తరచు చెబుతుండేవాడని అన్నారు.