: తనకొచ్చిన అవార్డులు వెనక్కిచ్చే సమస్యే లేదన్న సినీనటి శోభన!
ఇండియాలో మత విశ్వాసాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఘటనలను నిరసిస్తూ, పలువురు ప్రముఖులు తమకు లభించిన అవార్డులను వెనక్కిచ్చేస్తున్న వేళ, ప్రముఖ సినీ నటి శోభన మాత్రం, దేశంలో జరుగుతున్న ఉదంతాల గురించి తనకు సమాచారం లేదని, తనకు వచ్చిన అవార్డులను వెనక్కిచ్చే సమస్యే లేదని తేల్చిచెపారు. కేరళలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమెను, దాద్రి సంఘటన గురించి గుర్తు చేసి, అవార్డులు తిరిగి ఇచ్చేస్తున్న విషయమై మీడియా ప్రశ్నించగా, దాద్రి ఉదంతం ఎక్కడ, ఎలా జరిగిందో తనకు తెలియదని చెప్పింది. ఏ అవార్డులను ఎవరు వెనక్కు ఇచ్చారు? అని ఎదురు ప్రశ్నించింది. మీడియా ప్రతినిధులు మరికొంత లోతుగా విషయం తెలిపితే, వారికి లేటు వయసులో అవార్డులు వచ్చాయేమో!... అందుకే వెనక్కిచ్చి వుంటారని చెప్పి తప్పించుకుంది.