: ఎయిడ్స్ ఉందని తెలిసీ 150 మందితో సంబంధాలు... వీడు మామూలోడు కాదంటున్న హైదరాబాద్ పోలీసులు
తనకు ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధి ఉందని తెలిసి కూడా సుమారు 150 మంది అమ్మాయిలను మోసం చేసిన అత్యంత దుర్మార్గుడిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో 300 మందికి ఎయిడ్స్ అంటించాలన్నదే తన ఉద్దేశమని అతడు చెప్పిన మాటలు విని నిర్ఘాంతపోయారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, విలాసాలకు అలవాటు పడి, పగలు ఆటో నడుపుతూ, రాత్రుళ్లు దొంగతనాలు చేస్తున్న జేమ్స్ అనే వ్యక్తి ఉప్పల్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతన్ని విచారించిన పోలీసులు నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలను ట్రాప్ చేసే జేమ్స్ విచ్చలవిడిగా శృంగారాన్ని సాగించే వాడు. ఇప్పటికే దాదాపు 150 మందితో అతనికి సంబంధాలున్నాయి. ఇప్పుడిక జేమ్స్ సాగించిన మోసాలను వెలికితీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.