: అమరావతిలోని నిర్మాణాలు కూలిపోయే ప్రమాదం ఉంది: భూమన


ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు ముహూర్తం దగ్గరపడుతున్న సమయంలో కూడా వైకాపా నేతల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. అమరావతి ప్రచారం కోసం చివరకు దేవుళ్లను కూడా చంద్రబాబు వదలడం లేదని విమర్శించారు. రాజధానిలోని నిర్మాణాలను హడావుడిగా చేపట్టబోతున్నారని... దీనివల్ల ఆ కట్టడాలు భవిష్యత్తులో పేకమేడల్లా కూలిపోయే ప్రమాదం ఉందని అన్నారు. శంకుస్థాపనకు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని... టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News