: ఏ పార్టీకి ఎంత సీనుందో ఉప ఎన్నికలో తేలిపోతుంది: కడియం
త్వరలో జరగనున్న వరంగల్ ఉప ఎన్నికలో ఏ పార్టీకి ఎంత ప్రజాదరణ ఉందన్న విషయం తేలిపోనుందని టీఎస్ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ నేతల దోపిడీని చూసే ఆ పార్టీని ప్రజలు దూరం పెట్టారని చెప్పారు. చివరకు రైతుల ఆత్మహత్యలను కూడా కాంగ్రెస్ నేతలు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో వందల మంది మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేశారని... చర్చల పేరుతో వారిని పిలిచి, వారి స్థావరాలను తెలుసుకుని చంపేశారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ పచ్చటి తెలంగాణను కోరుకుంటోందని, నెత్తుటి తెలంగాణను కాదని చెప్పారు. విపక్ష నేతలు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.