: అణ్వాయుధాలు ఉన్నాయి... ఇండియాతో యుద్ధం వస్తే వాడతాం: తొలిసారిగా నోరువిప్పిన పాక్
అణు సామర్థ్యంపై పాకిస్థాన్ తొలిసారిగా బహిరంగ వ్యాఖ్యలు చేసింది. తమ వద్ద తక్కువ శక్తిని విడుదల చేసే అణ్వాయుధాలు ఉన్నాయని, ఒకవేళ ఇండియాతో యుద్ధం చేయాల్సి వస్తే వీటిని వాడతామని పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఐజాజ్ చౌధురి స్పష్టం చేసినట్టు 'డాన్' పత్రిక వెల్లడించింది. పాకిస్థాన్ కు చెందిన సీనియర్ అధికారి ఒకరు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి. తమ యుద్ధ వ్యూహాల్లో భాగంగానే వీటిని తయారు చేశామని ఆయన తెలిపారు. నవాజ్ షరీఫ్ ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా యూఎస్ తో ఎటువంటి అణు ఒప్పందాన్ని చేసుకోలేదని ఆయన వివరించారు. తమ దేశ అణు కార్యక్రమాలు యుద్ధాన్ని ప్రేరేపించేందుకు కాదని, ముందు జాగ్రత్త చర్యల కోసమేనని ఆయన చెప్పారు.