: అలీబాబా చీఫ్ 'జాక్ మా'కు సలహాదారు ఉద్యోగమిచ్చిన బ్రిటన్ ప్రధాని


చైనాలోని ప్రధాన వ్యాపారవేత్తల్లో ఒకరు, ఈ-కామర్స్ విప్లవాన్ని ముందే గుర్తించి అలీబాబా పేరిట సంస్థను స్థాపించి ఘన విజయం సాధించిన 'జాక్ మా'కు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ఉద్యోగం ఇచ్చారు. తనకు వ్యాపార సలహాలను అందించే టీమ్ లో 'జాక్ మా'కు స్థానం కల్పించారు. చైనా ప్రధాని క్సీ జిన్ పింగ్, తన నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ కు బయలుదేరనున్న వేళ ఈ ప్రకటన వెలువడింది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన చైనాలో వ్యాపారంపై కన్నేసిన బ్రిటన్, అక్కడి వ్యాపార అవకాశాలను తెలియజేస్తూ, ఏఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చన్న విషయమై సలహాలు ఇచ్చే పనిని 'జాక్ మా' చేతుల్లో పెట్టినట్టు కామెరాన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. చైనాతో బలమైన స్నేహ బంధం తమ దేశానికి లాభిస్తుందని తాము నమ్ముతున్నట్టు వివరించారు. కాగా, సలహాలిచ్చినందుకు జాక్ కు లభించే ప్రతిఫలం ఎంతన్న విషయం వెల్లడికాలేదు.

  • Loading...

More Telugu News