: బాలీవుడ్ నటుడిపై రేప్ కేసు
మున్నాభాయ్ ఎంబీబీఎస్, టాంగో చార్లీ, చాందిని బార్ తదితర చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు విశాల్ థక్కర్ పై రేప్ కేసు నమోదైంది. సెక్షన్ 376 (రేప్), 420 (చీటింగ్), 323, 509, 506 (నేరపూరితంగా భయపెట్టడం) కింద విశాల్ పై ముంబైలోని చార్ కోప్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ టీవీ నటిపై విశాల్ అత్యాచారం చేశాడు. విశాల్ నివాసంలోనే తనపై ఆయన అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పలు సీరియల్స్ లో బాధితురాలు నటించిందని పోలీసులు తెలిపారు. అయితే, విశాల్ థక్కర్ ఇంతవరకు అరెస్ట్ కాలేదు.