: అమరావతి శంకుస్థాపనలో ఆటా పాటా...3 గంటల పాటు సాంస్కృతిక సంబరాల హోరు
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఈ నెల 22న విజయదశమి పర్వదినాన అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం పూర్తి చేసింది. విజయదశమి రోజున మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. అయితే అంతకుముందే ఆ రోజు ఉదయం 9 గంటల నుంచే అమరావతి శంకుస్థాపన ప్రాంగణం సాంస్కృతిక సంబరాలతో హోరెత్తనుంది. ఇందుకోసం ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ప్రముఖ వాద్య కారుడు శివమణి తన డ్రమ్స్ తో వేదికను హోరెత్తించనున్నాడు. ఇక ప్రముఖ నటుడు సాయి కుమార్, సింగర్ సునీతలు తమదైన వ్యాఖ్యానంతో ఆహూతులను ఉర్రూతలూగించనున్నారు.