: కేసీఆర్ ను ‘స్పెషల్ గెస్ట్’గా పరిగణించండి: ఏపీ అధికారులకు చంద్రబాబు ఆదేశం


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న తన అధికార యంత్రాంగానికి ఓ విషయాన్ని పదే పదే నొక్కి చెప్పారు. అదేంటంటే, నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరవుతున్న విషయమే. నిన్న హైదరాబాదు నుంచి విజయవాడకు వెళ్లిన తర్వాత శంకుస్థాపనకు వస్తున్న అతిథులు, వారికి చేస్తున్న ఏర్పాట్లపై చంద్రబాబు అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వస్తున్న విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు, ఆయనను ప్రత్యేక అతిథిగా పరిగణించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆతిథ్యంలో ఏమాత్రం లోటు రానీయవద్దని ఆయన సూచించారు. అంతేకాక రోడ్డు మార్గం మీదుగా వస్తానన్న కేసీఆర్ కు హెలికాప్టర్ ఏర్పాటు చేస్తున్నామన్న విషయాన్ని తెలియజేయాలని కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News