: ‘రసగుల్లా’ గొడవ మళ్లీ మొదటికి!


రసగుల్లా మాదంటే మాదంటూ ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కొన్నాళ్ళుగా కొట్టుకుంటున్నాయి. దానిపై పేటెంట్ హక్కులు తమకే కావాలంటూ పోటీ పడుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ మంత్రి రసగుల్లాకు తామే యజమానులమనడంతో మళ్లీ తగవుకు దారితీసింది. రసగుల్లా బెంగాల్ దేనని నిరూపించడానికి తమ వద్ద పుష్కలంగా ఆధారాలు ఉన్నాయని మంత్రి రబిరంజన్ ఛటోపాధ్యాయ అనడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఆరు వందల ఏళ్ళక్రితం తమ రాష్ట్రంలో రసగుల్లా పుట్టిందని చెప్పినా ఒడిశా తగిన ఆధారాలు చూపించలేకపోయిందని పశ్చిమబెంగాల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అంటున్నారు. అయితే పంచదార పాకాన్ని ఆరు వందల ఏళ్ళక్రితమే తమ రాష్ట్రం కనుగొందని, దీనిపై నిర్ధారణ కోసం ఒడిశా ప్రభుత్వం మూడు కమిటీలను కూడా వేసిందని ఆ రాష్ట్ర మంత్రి ఇటీవల తెలిపారు. అంతేకాదు తమ రాష్ట్రంలోని పూరి జగన్నాథ్ ఆలయంలో మొదటిసారి 12వ శతాబ్దంలోనే ఈ స్వీట్ వడ్డించినట్లుగా ఆధారాలున్నాయని, బెంగాల్ చూపించే ఆధారాలు 150 ఏళ్ళ క్రితంవేనని ఒడిశా అధికారులు అంటున్నారు. కాగా, రసగుల్లా తమదేనంటూ తాజా దరఖాస్తు సమర్పించడంతోపాటు, దానికి సంబంధించిన వివరణాత్మక పత్రాలను కూడా అందజేసినట్లు బెంగాల్ మంత్రి చెప్పారు.

  • Loading...

More Telugu News