: పీర్ల ఉత్సవాలకు హైకోర్టు అనుమతి
ఈనెల 24, 26 తేదీల్లో విజయవాడలో పీర్ల ఉత్సవాలను నిర్వహించుకునేందుకు హైకోర్టు అనుమతించింది. ఉత్సవాల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అయితే, నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన నేపథ్యంలో పీర్ల ఉత్సవాల నిర్వహణకు ఉన్న అనుమతిని పోలీసులు రద్దు చేశారు. దీంతో, పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. పీర్ల ఉత్సవ నిర్వాహకులకు అనుకూలంగా తీర్పు రావడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. ఆయా తేదీల్లో ఉత్సవాలను నిర్వహించే ఏర్పాట్లు చేసుకుంటామని నిర్వాహకులు పేర్కొన్నారు.