: నవ్యాంధ్ర నిర్మాణానికి ‘జై బాలయ్య’ ఇటుకలు


నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కొత్త రకం ఇటుకలు రానున్నాయి. ఆ ఇటుకలను ఒక నటుడి అభిమానం సంఘం వారు తయారు చేయిస్తున్నారు. ఆ ఇటుకలపై తమ హీరో పేరు ఉండేటట్లుగా వాటిని తయారు చేయిస్తున్నామని చెబుతున్నారు. అమరావతి నిర్మాణానికి ఒక లక్ష ‘జై బాలయ్య’ ఇటుకలను పంపిణీ చేస్తామని నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం ‘ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్’ సంస్థ అధ్యక్షుడు జగన్ వెల్లడించారు. తమ అభిమాన నటుడు బాలయ్యబాబు పేరిట తయారు చేస్తున్న ఈ ఇటుకలపై ‘జై బాలయ్య’ అని ముద్రించే విధంగా తయారీ సంస్థలతో ఒప్పందం చేసుకున్నామని ఆయన చెప్పారు. కాగా, ‘మై బ్రిక్ - మై అమరావతి’ ట్యాగ్ లైన్ తో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రారంభించిన వెబ్ సైట్ ద్వారా ఇప్పటికే 20 లక్షలకు పైగా ఈ- ఇటుకలను విరాళంగా ఇచ్చారు. ఒక్కొక్క ఇటుక ఖరీదు రూ.10గా ఉంది.

  • Loading...

More Telugu News