: గుజరాత్ లో మ్యాగీ అమ్మకాలపై నిషేధం తొలగింపు
గుజరాత్ లో మ్యాగీ నూడిల్స్ పై నిషేధం ఎత్తి వేశారు. ఈ మేరకు గుజరాత్ సర్కార్ ఒక ప్రకటన చేసింది. మ్యాగీ నూడిల్స్ పై బాంబే హైకోర్టు నిషేధాన్ని ఎత్తివేయడంతో తమ రాష్ట్రంలో దాని అమ్మకాలపై నిషేధాన్ని తొలగిస్తున్నట్లు రాష్ట్ర ఎఫ్ డీసీఏ కమిషనర్ హెచ్ జీ కోషియా తెలిపారు. బాంబే హైకోర్టు ఆదేశాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోషియా చెప్పారు. కాగా, ఈ ఏడాది జూన్ లో మ్యాగీ అమ్మకాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మ్యాగీలో సీసం, మోనో సోడియంల స్థాయి నిర్దేశించిన దానికంటే ఎక్కువగా ఉండటంతో దానిని నిషేధించారు. అయితే, అనంతర పరిణామాల నేపథ్యంలో మ్యాగీ పై నిషేధాన్ని ఎత్తివేస్తూ బాంబే హైకోర్టు గతంలో తీర్పు యిచ్చింది. ఆ తీర్పు వెలువడిన చాలా రోజుల వరకు గుజరాత్ లో మ్యాగీ అమ్మకాలపై నిషేధం కొనసాగిన విషయం తెలిసిందే.