: రాష్ట్రానికి రెండు పండగలొచ్చాయి: ముఖ్యమంత్రి చంద్రబాబు
రాష్ట్రానికి రెండు పండగలు ఒకేసారి వచ్చాయని, ప్రజలు దసరా, రాజధాని శంకుస్థాపన పండగలు చేసుకోనున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రాలను విజయవాడ కనకదుర్గమ్మ పాదాల చెంత ఉంచిన అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. అమరావతి నిర్మాణం నిర్విఘ్నంగా సాగాలని అమ్మవారికి పూజలు చేశానని, ఈ విజయదశమి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రార్థించానని బాబు చెప్పారు. దుర్గ గుడి అభివృద్ధికి బృహత్ ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తామని, డిసెంబర్ మొదటి వారానికి ఆన్ లైన్ లో అన్ని ఆలయాల వివరాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.