: చిరు, పవన్ ల కలయికపై స్పందించిన వర్మ
మెగా ఫ్యామిలీపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'కామెంట్ల' దాడి కొనసాగుతూనే ఉంది. చిరంజీవి నివాసానికి వెళ్లి రామ్ చరణ్ తో కలసి పవన్ కల్యాణ్ దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి... 'నయాగరా జలపాతం తర్వాత అంతటి గొప్ప ఫొటో ఇదే' అంటూ కామెంట్ చేశాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్ లు కలవడం కల అనుకున్నానని... తీరా లేచి చూశాక అది నిజమని నిర్ధారించుకున్నానని ట్వీట్ చేశాడు. బ్రూస్ లీ చిత్రాన్ని మళ్లీ చూశానని... రామ్ చరణ్ అద్భుతంగా ఉన్నాడని వర్మ చెప్పాడు.