: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. కాగా, దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రి భక్త జనసంద్రంగా మారింది. నేడు అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో మాతను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అమ్మవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. వినాయకుడి గుడి నుంచి కొండపైకి క్యూలో భక్తులు బారులు తీరారు.

  • Loading...

More Telugu News