: మారిన ప్లాన్... అమరావతికి హెలికాప్టర్ లో వెళ్లనున్న కేసీఆర్
అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళుతున్న సంగతి తెలిసిందే. రోడ్డు మార్గంలోనే అమరావతికి వెళ్లాలని తొలుత నిర్ణయించారు. అయితే, శంకుస్థాపన నేపథ్యంలో, భారీ ఎత్తున వాహనాలు తరలిరానుండటంతో... ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో, రోడ్డు మార్గంలో వెళ్లడం సముచితం కాదని అధికారులు భావిస్తున్నారు. దీంతో, ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ లోనే అమరావతికి వెళ్లడం మంచిదని నిర్ణయించారు.