: హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న ఎర్రబెల్లి
పార్టీ పిరాయింపుదార్ల అంశం తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తూనే ఉంది. తాజాగా ఫిరాయింపుదార్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు. బుధవారం నాడు ఈ పిటిషన్ ను ఆయన దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫిరాయింపుదార్లపై వేటు పడేంత వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఉద్యమం జరుగుతున్న సమయంలో పలు స్థానాల్లో ఉపఎన్నికల కోసం ఆరాటపడిన టీఆర్ఎస్ పార్టీ... ఇప్పుడు అదే ఎన్నికలపై ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.