: బీహార్ ఎన్నికల్లో అభివృద్ధి అంశమే ప్రధాన అజెండా: అమిత్ షా


బీహార్ ఎన్నికల్లో అభివృద్ధి అంశమే ప్రధాన అజెండా అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. తొలి విడత ఎన్నికల్లో 32-34 స్థానాల్లో గెలుస్తామని, రెండో విడత ఎన్నికల్లో 22-24 స్థానాల్లో గెలుస్తామని చెప్పారు. అధికారం కోసమే నితీష్, లాలూ కాంగ్రెస్ తో జట్టు కట్టారని విమర్శించారు. పాట్నాలో నిర్వహించిన మీడియా సమావేశంలో అమిత్ షా ఈ మేరకు మాట్లాడారు. సమాజంలోని వెనుకబడిన వర్గాల వారి రిజర్వేషన్లకు తమ పార్టీ పూర్తి మద్దతిస్తుందన్నారు. ఓబీసీ వర్గానికి చెందిన అనేక మంది ముఖ్యమంత్రులను బీజేపీ ఇచ్చిందని, అంతేగాక ఓబీసీ ప్రధానిని కూడా తమ పార్టీయే అందించిందని తెలిపారు.

  • Loading...

More Telugu News