: ప్రజా రాజధాని గిన్నిస్ పుటలకెక్కడం ఖాయం...ఇంద్రకీలాద్రిపై ఎంపీ కేశినేని నాని ప్రకటన
టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని కొద్దిసేపటి క్రితం ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు కీలక విషయాలను ప్రకటించారు. ప్రజా రాజధానిగా రూపొందుతున్న నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి గిన్నిస్ రికార్డులకెక్కుతుందని ఆయన ప్రకటించారు. అంతేకాక, విజయవాడలో దేశంలో అరుదైన ఫ్లై ఓవర్ ను నిర్మించనున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే టెండర్ ప్రకటన విడుదల చేశామని, మరో పది రోజుల్లో పనులు ప్రారంభం కానున్నాయని ఆయన పేర్కొన్నారు. కొత్తగా నిర్మితం కానున్న ఫ్లై ఓవర్ దేశంలోనే అత్యంత ప్రత్యేకమైనదిగా రికార్డులకెక్కుతుందని నాని ప్రకటించారు.