: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం...అమ్మవారికి నేడు చంద్రబాబు పట్టు వస్త్రాల సమర్పణ
విజయవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి కొండకు నేడు భక్తజనం పోటెత్తింది. అమ్మవారి జన్మనక్షత్రం మూల నక్షత్రం నేడే కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుతం అక్కడ భక్తుల క్యూలైన్ ఆలయం దాటి, ఐదు కిలో మీటర్ల మేర పెరిగిపోయింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అంతరాలయం, వీఐపీ దర్శనాలను ఆలయ అధికారులు రద్దు చేశారు. ఇదిలా ఉంటే, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న చంద్రబాబు మరికాసేపట్లో 'ఈనాడు' గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు అమరావతి ఆహ్వానాన్ని అందజేసిన తర్వాత నేరుగా విజయవాడ బయలుదేరతారు. గన్నవరం ఎయిర్ పోర్టులో నూతన టెర్మినల్ ను ప్రారంభించిన తర్వాత ఆయన దుర్గమ్మ గుడికి వెళతారు.