: గవర్నర్ నరసింహన్ ను ఆహ్వానించిన చంద్రబాబు
అమరావతి శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి రావాలంటూ తెలుగు రాష్ట్రాల గవర్నరు నరసింహన్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రికను ఆయనకు బాబు స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరుకావాలని చంద్రబాబు కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అనంతరం రాజ్ భవన్ కు చంద్రబాబు వెళ్లారు. కాగా, ఇప్పటికే పలువురు వీవీఐపీలకు, ప్రముఖులకు అమరావతి శంకుస్థాపన మహోత్సవ ఆహ్వానాలు అందాయి. టీటీడీపీ నేతలను కూడా చంద్రబాబు ఆహ్వానించిన విషయం తెలిసిందే.