: పవన్ కల్యాణ్ కు అలయ్-బలయ్ ఆహ్వానం
ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఈరోజు సమావేశమయ్యారు. ఈ నెల 23న తాను నిర్వహించే అలయ్-బలయ్ కార్యక్రమానికి రావాల్సిందిగా పవన్ ను దత్తాత్రేయ ఆహ్వానించారు. కాగా, తెలంగాణ రుచులు, సంస్కృతి, సంప్రదాయాలను అలయ్-బలయ్ ద్వారా పరిచయం చేస్తారు. దీనిలో భాగంగా తెలంగాణ జానపద, సాంస్కృతిక కళారూపాలను కూడా ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమాన్ని కొన్నేళ్లుగా దత్తాత్రేయ నిర్వహిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా రాజకీయనాయకులను, ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తుండటం పరిపాటి.