: తమ్ముడికి పుష్పగుచ్ఛమిచ్చి ఆహ్వానించిన చిరంజీవి


తమ్ముడు పవన్ కల్యాణ్ కు పుష్పగుచ్ఛమిచ్చి మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానించారు. బ్రూస్ లీ చిత్రంలో నటించిన అన్నయ్యకు అభినందనలు చెప్పేందుకని చిరంజీవి నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ కు ప్రేమపూర్వకంగా ఆహ్వానం లభించింది. ప్రసుత్తం 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా షూటింగ్ లో పవన్ చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దాంతో, షూటింగు నుంచి సరాసరి రావడంతో, ఆయన 'సర్దార్ గబ్బర్ సింగ్' వేషధారణలోనే చిరంజీవి ఇంటికి వెళ్లినట్లు సమాచారం. కాగా, రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన బ్రూస్ లీ చిత్రంలో చిరంజీవి అతిథి పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం విడుదలైన బ్రూస్ లీ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు.

  • Loading...

More Telugu News