: అందుకే రాజధాని నిర్మాణబాధ్యతలు నాకు దక్కాయి: సీఎం చంద్రబాబు


ఏడుకొండల వాడి పాదాల చెంతనే తాను జన్మించానని, అందుకే తనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణ బాధ్యతలు దక్కాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషపడ్డారు. చంద్రబాబు మనవడు దేవాన్ష్ అన్న ప్రాసన కార్యక్రమం తిరుమలలో ఘనంగా జరిగింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోని పవిత్ర నదీ జలాలను నూతన రాజధాని నిర్మాణంలో ఉపయోగిస్తామని, ప్రపంచ దేశాల రాజధానుల మధ్య అమరావతిని నిలబెడతామని అన్నారు. కాగా, తిరుమలో జరిగిన అన్నప్రాసన కార్యక్రమంలో చంద్రబాబు కుటుంసభ్యులు, నందమూరి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News