: సినిమా కోసం అమితాబ్ ను కలవలేదు: దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య


"ధూమ్-4 చిత్రం కోసం అమితాబ్ ను కలవలేదు. అసలా ప్రస్తావనే రాలేదు. ధూమ్-2లో నటించిన హృతిక్ రోషనే, ధూమ్-4లో కూడా ప్రధాన పాత్రలో నటిస్తారు. కొద్ది రోజుల్లో సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాము. అప్పటివరకు ఇందులో నటించే నటీనటుల వివరాల గురించి లేనిపోని ప్రచారాలు చేయవద్దు" అని దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య పేర్కొన్నారు. ఆచార్య యశ్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఒక ముఖ్యపాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమితాబ్ ను ఆచార్య కలిశారని కూడా ప్రచారం జరిగింది. అదేమిలేదని, ఈ సినిమా కోసం అమితాబ్ ను తాను కలవలేదని ఒక ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News