: డబుల్ బెడ్ రూం ఇళ్లా? అమరావతి శంకుస్థాపనా?... కేసీఆర్ ఓటు దేనికి?
తెలంగాణలో పేద ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూం ప్లాట్ల ప్రారంభోత్సవమా? లేక పక్క రాష్ట్ర రాజధాని నగర నిర్మాణానికి శంకుస్థాపనా? వీటిల్లో ఏ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు? తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ ఇది. ఈ సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లి, శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెళ్లాలా? వద్దా? అన్నది సాయంత్రం తరువాత నిర్ణయిస్తామని టీఎస్ మంత్రి కేటీఆర్ కొద్దిసేపటి క్రితం మీడియాకు స్పష్టం చేశారు. ఒకవేళ కేసీఆర్ అమరావతికి వెళ్లాలని భావిస్తే, దసరా నాడు పెట్టుకున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల కార్యక్రమం వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే!