: 'మేకిన్ ఇండియా'కు తూట్లు... అతిపెద్ద వల్లభాయ్ పటేల్ విగ్రహం తయారీ కాంట్రాక్టు చైనాకు


ప్రధాని తన కలల ప్రాజెక్టుగా చెప్పుకుని పార్లమెంటు ఎన్నికలకు ముందు ప్రకటించిన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' కాంట్రాక్టులో భాగంగా 182 మీటర్ల ఎత్తయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తయారీ చైనాలో జరుగుతోంది. ఈ విషయం వెల్లడైనప్పటి నుంచి 'మేకిన్ ఇండియా'కు తూట్లు పడుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్దార్ సరోవర్ డ్యామ్ సమీపంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నది మోదీ మనసులో చిరకాలంగా ఉండిపోయిన కోరిక. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే జాతీయ హోదా దక్కగా, విగ్రహ నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకున్న ఎల్అండ్ టీ దాన్ని ఓ చైనా కంపెనీకి సబ్ కాంట్రాక్టుకు ఇచ్చింది. ఈ విగ్రహం పనులను ప్రపంచంలోని అతిపెద్ద ఫౌండరీగా గుర్తింపున్న 'జియాంగ్జీ టొకీనే మెటల్ హ్యాండీక్రాఫ్ట్స్ కంపెనీ లిమిటెడ్'కు అప్పగించింది. చైనా ప్రభుత్వ వైఖరిని తాను మంత్రిగా ఉన్న సమయంలో వల్లభాయ్ ఎంతో విమర్శించేవారు. ఈ మేరకు అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు లేఖల రూపంలో కూడా రాశారు. అటువంటిది ఈ విగ్రహం ఏర్పాటు చైనా సంస్థ చేతికి వెళ్లడం ఆమోదయోగ్యం కాదన్నది పలువురి అభిప్రాయం. కాగా, ఇది అతిపెద్ద అంతర్జాతీయ ప్రాజెక్టని, అందువల్ల బ్రాంజ్ ప్లేటింగ్ ను చైనాలో తయారు చేయించేందుకు అంగీకరించామని సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ ఏక్తా ట్రస్ట్ కార్యదర్శి కే శ్రీనివాస్ తెలిపారు.

  • Loading...

More Telugu News