: దేవాన్ష్ ను ఒళ్లో పడుకోబెట్టుకుని బంగారు ఉంగరంతో శ్రీవారి ప్రసాదాన్ని నోటికందించిన చంద్రబాబు


నారా వారి వారసుడు, తన మనవడు, లోకేష్, బ్రాహ్మణి దంపతుల గారాలపంట దేవాన్ష్ ను తన ఒడిలో పడుకోబెట్టుకుని వేద మంత్రోచ్చారణల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వామివారి ప్రసాదాన్ని తినిపించడం ద్వారా అన్నప్రాసన కార్యక్రమాన్ని జరిపించారు. స్వామివారికి నైవేద్యంగా పెట్టిన పొంగలిని, బంగారు ఉంగరంతో దేవాన్ష్ నోటికి అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ప్రధానార్చకులు రమణ దీక్షితులు, డాలర్ శేషాద్రి, ఇతర పూజారులు, పండితులు పాల్గొని చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ దంపతులకు, ఇతర నారా, నందమూరి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ఆశీర్వచనం చేశారు. అధికారులు వీరికి స్వామివారి ప్రసాదాలు, శేషవస్త్రాలు, చిత్ర పటాలను అందించారు.

  • Loading...

More Telugu News