: శ్రీవారి ఆలయ మహాద్వారం ఎదుట పోలీసుల కొట్లాట!


పవిత్ర తిరుమలలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) కానిస్టేబుల్ కు, ఓ సెక్యూరిటీ గార్డుకు మధ్య గొడవ జరగడం కలకలం రేపింది. భక్తులకు భద్రతగా ఉండాల్సిన పోలీసులు ఇలా కొట్టుకోవడాన్ని ఆ శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆలయ మహాద్వారం దగ్గర జరిగిన ఈ ఘటనలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శివానంద తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఇతర పోలీసులు అతనిని అశ్వని ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం మోహినీ రూపంలో స్వామివారి ఊరేగింపు ముగిసిన అనంతరం ఈ గొడవ చోటు చేసుకుంది. బాలాజీ అనే సెక్యూరిటీ గార్డు గొడవకు కారణమని, అతనే దాడి చేశాడని శివానంద ఆరోపించాడు. తన విధుల్లో భాగంగా ఆయుధంతో ఆలయం లోపలికి వెళ్తున్న శివానందను సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడమే గొడవకు మూల కారణమని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పర్యటన అనంతరం ఈ ఘటనపై విచారణ జరుపుతామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News