: పోలీసుల గుప్పెట్లోకి రాజ్ కోట్, మొబైల్ సేవల బంద్


మరికొన్ని గంటల్లో ఇండియా, దక్షిణాఫ్రికాల మధ్య మూడవ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ పోటీ జరగనున్న నేపథ్యంలో పటేల్ వర్గం యువకుల నుంచి ఏవైనా అవాంతరాలు వస్తాయన్న ఆలోచనతో రాజ్ కోట్ లోని స్టేడియం పరిసరాల్లో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. జిల్లా పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై సోమవారం ఉదయం వరకూ నిషేధాన్ని విధించినట్టు కలెక్టర్ తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా వదంతులు వ్యాపించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఐదుగురు ఎస్పీల నేతృత్వంలో 2 వేల మంది సాధారణ పోలీసులతో పాటు స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఒక కంపెనీ రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఏడు టీముల క్విక్ రెస్పాన్స్ సెల్స్ ను భద్రత కోసం నియమించామని రాజ్ కోట్ రేంజీ ఐజీ డీఆర్ పటేల్ వివరించారు. మూడు డ్రోన్ కెమెరాలు, 90 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. స్టేడియంకు వచ్చే ప్రతి వ్యక్తి కదలికలనూ నిశితంగా పరిశీలిస్తుంటామని, అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

  • Loading...

More Telugu News