: ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో స్వల్ప భూకంపం
ప్రకాశం జిల్లా పామూరు, వరికుంటపాడు మండలాలతో పాటు నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. సుమారు 2 నుంచి ఐదు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన గత రాత్రి జరుగగా, పలు చోట్ల రాత్రంతా ప్రజలు ఆరు బయటనే కాలం గడిపారు. భూకంపం కారణంగా పలు ఇళ్లలో అటకల మీది వస్తువులు కింద పడ్డాయని తెలుస్తోంది. ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. భూకంపం వచ్చిన ప్రాంతాలకు తరలివెళ్లిన రెవెన్యూ అధికారులు ప్రజలకు ధైర్యం చెప్పారు.