: అమర్ సింగ్ నన్ను చంపేందుకు కుట్ర పన్నారు: అజాం ఖాన్ ఆందోళన
సమాజ్ వాది పార్టీ మాజీ నేత అమర్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ లపై ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి అజాం ఖాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. వీరిద్దరూ తనను చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. వీరిద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారని... తనను అంతం చేయడానికి ప్రణాళికలు రచించారని భయాందోళనలు వెలిబుచ్చారు. అనుకున్నది చేయగల సత్తా వీరికి ఉందని చెప్పారు. మరోవైపు, అజాం ఖాన్ నుంచి తమకు ప్రాణహాని ఉందని గతంలో అమర్ సింగ్, సంగీత్ సోమ్ లు ఆరోపించారు. ఉగ్రవాద కార్యకలాపాలతో అజాం ఖాన్ కు సంబంధాలు ఉన్నాయని వీరిద్దరూ ఆందోళన వెలిబుచ్చారు.