: చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పిన చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి థ్యాంక్స్ చెప్పారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తనను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సాయంత్రం ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు వెళ్లి చిరంజీవిని కలిసి, ఆహ్వానపత్రికను అందించారు. శంకుస్థాపనకు వచ్చేందుకు ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా మంత్రులకు ఆయన తెలిపారు. అమరావతికి వస్తానని చిరంజీవి చెప్పడం ఆయన అభిమానులకు సంతోషం కలిగించే విషయమే.