: క్యారమ్స్ లో రికార్డు సృష్టించిన సమీర
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్యారమ్స్ లో సమీర అనే యువతి రికార్డు సృష్టించింది. 20 మందితో 20 గంటల 20 నిమిషాల 20 సెకండ్లు క్యారమ్స్ ఆడి ఈ రికార్డును సొంతం చేసుకుంది. నిన్న(శుక్రవారం) సాయంత్రం 6 గంటల నుంచి ఈ సాయంత్రం 4 గంటల 20 సెకండ్ల వరకు సమీర క్యారమ్స్ ఆడింది. సమీర రికార్డును వండర్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు గుర్తించి నమోదు చేశారు.