: చంద్రబాబుపై జానారెడ్డి ప్రశంసలు!


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమని జానారెడ్డి వ్యాఖ్యానించారు. నేటి ఉదయం ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ లు హైదరాబాదులో జానారెడ్డిని కలిసి అమరావతి శంకుస్థాపనకు రావాలని ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమరావతి నగర నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News